‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి కారణమయ్యాయి. యాంకర్ నుండి నటిగా మారిన అనసూయ భరద్వాజ్ ఆయన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.
అయితే అనసూయ మరోమారు ఈ వివాదంపై స్పందించారు. శివాజీ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నారని, ప్రజలు ఆయన మాట వినేంత గౌరవం సంపాదించారని అనసూయ అన్నారు. ఆడపిల్లల భద్రత కోసం ఆయన పడిన ఆరాటం వెనుక మంచి ఉద్దేశమే ఉందని, అయితే కేవలం అమ్మాయిలకు మాత్రమే కాకుండా అబ్బాయిలకు కూడా వాళ్ల బాధ్యతను గుర్తు చేసి ఉంటే ఈ వివాదమే రాదని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.