ఆ విషయాన్ని బయట పెట్టిన అనసూయ

Anasuya Bharadwaj says Vijay Deverakonda’s publicist paid trolls to abuse her. అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య అర్జున్ రెడ్డి సినిమా నుంచి వివాదం కొనసాగుతోంది.

By Medi Samrat  Published on  9 Jun 2023 9:00 PM IST
ఆ విషయాన్ని బయట పెట్టిన అనసూయ

అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య అర్జున్ రెడ్డి సినిమా నుంచి వివాదం కొనసాగుతోంది. ఇంతకూ గొడవ ఏమిటా అనే ప్రశ్న కూడా వెంటాడుతూ ఉంది. అయితే విజయ్ దేవరకొండకు అతి దగ్గర వ్యక్తి కారణంగానే ఈ వివాదం ఇన్ని రోజులూ నడిచిందని అనసూయ నోటి నుండి వచ్చిన మాటల ద్వారా మనకు అర్థం అవుతోంది. విజయ్ దేవరకొండతో నాకు ఎప్పట్నుంచో మంచి స్నేహం ఉందని.. ఆయన హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో అభ్యంతకర పదాలు ఉండగా.. ఆ విషయాన్ని నేను వ్యతిరేకించాను. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఆడియన్స్ తో కూడా ఆ పదాలను విజయ్ చెప్పించడం నాకు నచ్చలేదని తెలిపింది. అలాంటి వాటిని ప్రోత్సహించొద్దని పర్సనల్ గా, పబ్లిక్ గా పలు ఇంటర్వ్యూలలో చెప్పాను. దీంతో నాపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఆ ట్రోల్స్ ని నేను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో కూడా నటించాను. విజయ్ కి చెందిన ఓ వ్యక్తి నన్ను ట్రోల్ చేయడానికి, నాపై నెగిటివ్ ట్రోల్స్ వేయడానికి డబ్బులిచ్చి మరీ చేయిస్తున్నాడని తెలిసింది. ఇదంతా విజయ్ కి తెలియకుండానే జరుగుతుందా? అని ప్రశ్నించింది. కానీ నేను మాత్రం ఇక్కడితో దీన్ని ఆపేయాలని కోరుకుంటున్నాను. ఇది వదిలేసి మానసికంగా ప్రశాంతంగా బతకాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది అనసూయ. విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో, లేదో నాకు తెలియదని అనసూయ తెలిపింది.

విజయ్ ఎప్పుడూ అనసూయ గురించి మాట్లాడకపోయినా అనసూయ మాత్రం డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా విజయ్ దేవరకొండ మీద కామెంట్స్, సైటైర్లు వేస్తూ వస్తోంది. దీంతో విజయ్ అభిమానులు అసభ్య పదజాలంతో అనసూయను తిడుతూ ఉన్నారు. వీటితో సోషల్ మీడియాలో చాలా రోజులుగా రచ్చ జరుగుతూ ఉంది. ఈ మధ్య విజయ్ దేవరకొండ పేరు ముందు 'ది' అనే విషయంలో కూడా అనసూయకు.. విజయ్ దేవరకొండ అభిమానులకు మధ్య గొడవ జరిగింది.


Next Story