'మూర్ఖులకు కొరత లేదు'..' బిగ్ బీ సీరియ‌స్ పోస్టు..!

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

By Medi Samrat  Published on  9 Dec 2024 9:44 AM GMT
మూర్ఖులకు కొరత లేదు.. బిగ్ బీ సీరియ‌స్ పోస్టు..!

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అంబానీ పెళ్లికి విడివిడిగా వచ్చిన తర్వాత విడాకుల పుకార్లు ఊపందుకున్నాయి. దీని తరువాత ఇటీవల ఐశ్వర్య-అభిషేక్ ఒక వివాహ వేడుకలో కలిసి కనిపించారు. వారిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారి రిలేషన్‌లో ఎటువంటి ఇబ్బందులు లేవ‌ని అభిమానులు సంతోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా X లో పోస్ట్‌లను షేర్ చేస్తూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా తన కుమారుడిపై జరుగుతున్న పుకార్లపై స్పందిస్తూ 'చుప్' అని రాశారు.

తాజాగా బిగ్ బి అమితాబ్ కొత్త పోస్ట్‌ను షేర్ చేశారు. అది చూస్తే పుకార్లు వ్యాప్తి చేసే వారిని అమితాబ్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. 'ప్రతి పదానికి అర్థం వెతికే వ్యక్తులు.. త‌మ‌ జీవితంలోని దురదృష్టాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు' అని రాశారు. ' ఈ పోస్ట్ వెనుక ఉన్న కారణాన్ని బిగ్ బి స్పష్టం చేయలేదు, కానీ అభిషేక్-ఐశ్వర్య గురించి వ్యాప్తి చెందుతున్న పుకార్ల గురించి ఆయ‌న‌ మాట్లాడుతున్నాడని వినియోగదారులు ఊహాగానాలు చేయడం ప్రారంభించారు.

అమితాబ్ బచ్చన్ కూడా తన అభిప్రాయాలను బ్లాగుల ద్వారా ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు. తాజా నోట్‌లో ఇలా రాశారు 'ప్రపంచంలో మూర్ఖులు, రిటార్డెడ్ వ్యక్తులకు కొరత లేదు. ఆ వ్యక్తులు తరచుగా ఇతరులు చేసిన వస్తువుల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో బిగ్ బి చేసిన ఈ పోస్ట్‌కు ఆయ‌న‌ అభిమానులు మద్దతు ఇస్తూనే ఉన్నారు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వసూళ్ల పరంగా ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్‌ను అభినందించారు. 'అల్లు అర్జున్ జీ మీ మంచి మాటలకు నేను పొంగిపోయాను. మీరు నేను ఊహించిన దాని కంటే ఎక్కువ ఇచ్చారు. మీ వ‌ర్క్‌ మా అందరికీ ఎప్పుడూ ఇష్టం. మీరు ఇలాగే మాకు స్ఫూర్తినిస్తూ ఉండండి. మీ విజయానికి నా శుభాకాంక్షలు అని రాశారు.

Next Story