Video : అల్లు అర్జున్ ఇంటిపై దాడి

డిసెంబర్ 22 ఆదివారం అల్లు అర్జున్ నివాసంపై కొందరు దుండగులు టమోటాలు విసిరారు.

By Medi Samrat
Published on : 22 Dec 2024 6:27 PM IST

Video : అల్లు అర్జున్ ఇంటిపై దాడి

డిసెంబర్ 22 ఆదివారం అల్లు అర్జున్ నివాసంపై కొందరు దుండగులు టమోటాలు విసిరారు. అంతేకాకుండా పూల కుండీలను ధ్వంసం చేశారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీకి చెందిన గ్రూపు నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించింది. అల్లు అర్జున్ నివాసం వద్ద టమాటాలు విసరడం కొనసాగిస్తుండగా సిబ్బందిని కూడా వారు అడ్డుకున్నారు. దాడి సమయంలో రాళ్లు కూడా విసిరినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని గేటు ముందు రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఓయూజేఏసీ సభ్యులను అక్కడి నుంచి తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు.

Next Story