ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో అల్లు అర్జున్

సినీ నటుడు అల్లు అర్జున్‌ బుధవారం ఖైరతాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో కనిపించారు.

By Medi Samrat  Published on  20 March 2024 5:28 PM IST
ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో అల్లు అర్జున్

సినీ నటుడు అల్లు అర్జున్‌ బుధవారం ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో కనిపించారు. అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆయన కార్యాలయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే.. రేంజ్‌ రోవర్‌ కారును TG 09 0666 నంబర్‌తో తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్‌ రవాణాశాఖ కార్యాలయానికి రావడంతో ఆయనతో ఫోటోలు దిగడానికి పలువురు ఎగబడ్డారు.

మరో వైపు హైదరాబాద్‌లో ఒకటి, వైజాగ్‌లో మరో రెండు కొత్త థియేటర్‌లను ప్రారంభించేందుకు అల్లు అర్జున్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని కొత్త మల్టీప్లెక్స్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆధునిక, సౌకర్యవంతమైన వీక్షణ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించనున్నారు. కోకాపేట్‌లోని అల్లు స్టూడియోస్‌కు సమీపంలో అల్లు అర్జున్ కొత్త థియేటర్లు ఉండవచ్చని అంటున్నారు.

Next Story