పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఐకాన్‌ స్టార్‌

Allu Arjun Visits Puneeth’s Brother To Offer Condolences. ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ గురువారం బెంగళూరులోని దివంగత కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నివాసంలో ఆయన కుటుంబాన్ని

By అంజి  Published on  3 Feb 2022 7:03 PM IST
పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఐకాన్‌ స్టార్‌

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ గురువారం బెంగళూరులోని దివంగత కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నివాసంలో ఆయన కుటుంబాన్ని సందర్శించి నివాళులర్పించారు. నటుడు పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్‌ను కలుసుకుని ఓదార్చారు. పునీత్ అక్టోబరు 29, 2021న తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో.. బన్నీ 'పుష్ప' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నందున పునీత్ కుటుంబాన్ని త్వరలో సందర్శించి సానుభూతి తెలియజేస్తానని చెప్పాడు. ఇక ప్రమోషన్స్‌లో కుటుంబాన్ని కలవడం సరికాదని, ఇది ప్రమోషన్ స్టంట్‌లా అనిపించకూడదని అన్నారు.

పునీత్‌ రాజ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులను కలుసుకుని నివాళులర్పించేందుకు ఆయన ఈరోజు బెంగళూరు చేరుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అక్టోబరులో పునీత్ మరణించినప్పుడు, బన్నీ దివంగత నటుడితో తన బంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకున్నారని చెప్పాడు. తన తాత, లెజెండరీ అల్లు రామలింగయ్య దివంగత కన్నడ స్టార్ కుటుంబానికి కూడా ఎలా సన్నిహితంగా ఉండేవారో కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.

Next Story