చిక్కడపల్లిలోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసుకు సంబంధించిసినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్‌లోని స్థానిక కోర్టు డిసెంబర్ 30కి వాయిదా వేసింది. నటుడి బెయిల్ పిటిషన్‌కు ప్రతిస్పందనగా కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు మరింత సమయం కోరడంతో, కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారం, డిసెంబర్ 30కి వాయిదా వేసింది. అల్లు అర్జున్ వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో తదుపరి విచారణను జనవరి 10కి కోర్టు వాయిదా వేసింది. సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, బాన్సర్ల పై కేసు నమోదు చేశారు. అందర్నీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.అల్లు అర్జున్ ని కూడా పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు విచారణ జరిపి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.