కోలుకున్న బన్నీ.. కరోనా నెగటివ్.. ఏమి చెప్పాడంటే..!

Allu Arjun Tested For Covid Negative. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా మహమ్మారి నుండి కోలుకున్నాడు.

By Medi Samrat  Published on  12 May 2021 11:37 AM IST
Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా మహమ్మారి నుండి కోలుకున్నాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తనకు కరోనా నెగటివ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. 'అందరికీ హలో.. 15 రోజులు క్వారెంటైన్ లో ఉన్న తర్వాత నాకు కరోనా నెగటివ్ వచ్చింది. నా ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ లాక్ డౌన్(తెలంగాణలో లాక్ డౌన్) కారణంగా కరోనా కేసులు తగ్గే అవకాశం ఉంది. ఇంట్లో ఉండండి.. జాగ్రత్తగా' అంటూ అల్లు అర్జున్ పోస్టు పెట్టాడు. అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ అనగానే ఎంతో మంది అభిమానులు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారు కోరుకున్నట్లుగానే అల్లు అర్జున్ కరోనాను జయించాడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్రనిర్మాతల్లో ఒకరైనా రవిశంకర్ స్పందించారు. సినిమా రెండు భాగాలుగా రానుందని.. ఎంతో స్పాన్ ఉన్న సబ్జెక్ట్ ను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమేనని భావించి.. అందరం కలిసి రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సెకండ్ పార్ట్ ఇప్పటికే 10% పూర్తి అయిందన్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Next Story