పుష్ప స్పెషల్ అదే.. ఆ విషయంలో తగ్గేదే లే అంటున్న మూవీ మేకర్స్..!

Allu Arjun Pushpa Movie New Update. మొదటి భాగం 'పుష్ప' టైటిల్ తో విడుదలవుతుందట.. ఇక రెండవ భాగం 'పుష్ప 2' అని కాకుండా వేరే టైటిల్ ను విడుదల చేయాలని భావిస్తున్నారనే వార్త

By Medi Samrat  Published on  18 May 2021 6:58 PM IST
Pushpa

అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో నటిస్తూ ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ 'పుష్ప' సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ ఎదగబోతూ ఉన్నాడు. ముఖ్యంగా చిత్రం నిడివి ఎక్కువగా అవుతోందని భావించిన చిత్ర యూనిట్.. రెండు భాగాలుగా సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయిపొయింది. చిత్రనిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఇటీవలే స్పందించారు. సినిమా రెండు భాగాలుగా రానుందని.. ఎంతో స్పాన్ ఉన్న సబ్జెక్ట్ ను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమేనని భావించి.. అందరం కలిసి రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సెకండ్ పార్ట్ ఇప్పటికే 10% పూర్తి అయిందన్నారు.

మొదటి భాగం 'పుష్ప' టైటిల్ తో విడుదలవుతుందట.. ఇక రెండవ భాగం 'పుష్ప 2' అని కాకుండా వేరే టైటిల్ ను విడుదల చేయాలని భావిస్తున్నారనే వార్త ఫిలింనగర్ వర్గాల్లో తిరుగుతోంది. ఆ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. బడ్జెట్ విషయంలో కూడా చిత్ర యూనిట్ తగ్గేదే లేదని అంటున్నారు నిర్మాతలు. ఈ రెండు భాగాలకు కలుపుకుని అవుతున్న ఖర్చు 250 కోట్లు అని అంటున్నారు. ఇది అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రాబోతున్న సినిమా అని స్పష్టంగా తెలుస్తోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఈ సినిమా సెకండాఫ్ లోనే ఐటమ్ సాంగ్ ఉంటుందనీ అందుకోసం బాలీ వుడ్ నటి పేర్లను పరిశీలిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. పుష్ప సినిమా విషయంలో వస్తున్న ఒక్కో అప్డేట్.. పుష్ప రేంజిని మరింత పెంచబోతోంది.

ఇక అల్లు అర్జున్ కరోనా మహమ్మారి నుండి కోలుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తనకు కరోనా నెగటివ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. 15 రోజులు క్వారెంటైన్ లో ఉన్న తర్వాత నాకు కరోనా నెగటివ్ వచ్చింది. నా ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అల్లు అర్జున్ అభిమానులకు స్వీట్ న్యూస్ చెప్పాడు.




Next Story