ఎవరూ ఆందోళన చెందకండి : అల్లు అర్జున్

అల్లు అర్జున్ జైలు నుండి విడుదలయ్యారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ వెల్లడించారు.

By Kalasani Durgapraveen  Published on  14 Dec 2024 3:49 AM GMT
ఎవరూ ఆందోళన చెందకండి : అల్లు అర్జున్

అల్లు అర్జున్ జైలు నుండి విడుదలయ్యారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ వెల్లడించారు. తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. తాను బాగున్నానని, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కేసు కోర్టులో ఉందని, తాను ఇప్పుడు ఏమీ మాట్లాడబోనని అన్నారు. రేవతి కుటుంబంలో జరిగిన దానికి ఎంతో బాధపడుతూ ఉన్నాను. థియేటర్ వద్ద అలాంటి ఘటన జరుగుతుందని అసలు ఊహించలేదన్నారు అల్లు అర్జున్.

ఇదిలాఉంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షోలో తొక్కిసలాటకు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ శుక్రవారం రాత్రి హైదరాబాద్ జైలులో గడిపాడు. జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్ రావడంలో జాప్యం కారణంగా శుక్రవారం విడుదల కాలేదని అధికారులు తెలిపారు. అల్లు అర్జున్ ను విడుదల చేయడానికి, ఆయన న్యాయ బృందం జైలు అధికారులకు 50 వేల రూపాయల పూచీకత్తును సమర్పించింది. శుక్రవారం రాత్రి హైకోర్టు నుండి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందాయి. దీంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ విడుదల అయ్యారు.

Next Story