అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు

'పుష్ప2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

By Medi Samrat  Published on  8 Jan 2025 5:16 PM IST
అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు

'పుష్ప2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై నటి నిహారిక స్పందించారు. ఇలాంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని, మహిళ చనిపోయిన విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని అన్నారు. అల్లు అర్జున్ ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పారు.

సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడి బేగంపేట్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను నటుడు అల్లు అర్జున్‌ జనవారు 7న పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు నిర్మాత దిల్‌రాజు ఆస్పత్రికి వెళ్లారు. కిమ్స్‌కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రాంగోపాల్‌ పేట్‌ పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story