ఇది దీపావళి వైబ్స్.. వీడియో చేసిన అల్లు అర్జున్‌..!

Allu arjun family diwali video viral . ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలతో ఎంతా బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి మాత్రం పక్కా సమయం కేటాయిస్తుంటాడు.

By అంజి  Published on  8 Nov 2021 4:48 AM GMT
ఇది దీపావళి వైబ్స్.. వీడియో చేసిన అల్లు అర్జున్‌..!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలతో ఎంతా బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి మాత్రం పక్కా సమయం కేటాయిస్తుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మనం చాలా సందర్భాల్లో సోషల్‌ మీడియాలో చూస్తుంటాం. తన పర్సనల్‌ లైఫ్‌తో ప్రొఫెషనల్‌ లైఫ్‌ని చక్కగా బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగుతున్నాడు అల్లు అర్జు. ఇటీవల అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకి వెళ్లాడు. అక్కడ బన్నీ ఫుల్‌గా ఎంజాయ్‌ చేశాడు. దీపావళి పండగను తన ఫ్యామిలీతో చాలా బాగా జరుపుకున్నాడు. 'ఫామ్ హౌస్‌ లో మా దీవాళి పార్టీ. ఈ అలంకరణకు కారణం స్నేహనే. తనే వ్యక్తిగతంగా ఇలా చేయించింది.

ఇది దీపావళి వైబ్స్ అంటూ అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అల్లు ఇంట దీపావళి వెలుగులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బిజినెస్‌లో తన సత్తా చాటుకుంటున్నాడు అల్లు అర్జున్‌. తాజాగా 'AAA' సినిమాస్‌ పేరుతో థియేటర్‌ రాబోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ 'పుష్ప' సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్‌ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.


Next Story
Share it