హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని హీరో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

By Kalasani Durgapraveen  Published on  11 Dec 2024 8:47 PM IST
హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని హీరో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రీమియర్లు వేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తొక్కిసలాటలో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదే ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యజమాని కోర్టును ఆశ్రయించారు. థియేటర్ యజమాని రేణుకా దేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవతి మృతితో తమకు సంబంధం లేదని పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రీమియర్, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, పుష్ప-2 సినిమాకు తాము ప్రీమియర్ షోలు నిర్వహించలేదన్నారు. డిస్ట్రిబ్యూటర్లే నేరుగా సినిమాను నడిపించుకున్నట్లు చెప్పారు. అయినప్పటికీ తమవంతుగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

Next Story