అల్లు అర్జున్, నటి శ్రీలీల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విజయవాడకు చెందిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్, శ్రీలీల కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లు అని, వారు తప్పుడు సమాచారం అందించారని AISF సభ్యులు ఆరోపించారు. “రెండు కాలేజీలకు ఒకే విద్యార్థి పేరు పెడుతున్నారు, ఇలాంటి మోసపూరిత ప్రచార పద్ధతుల వల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. దీనికి కారణమైన అటువంటి కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న వారిని కూడా వదిలిపెట్టకూడదు.” అని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
కొన్ని కాలేజీలు అల్లు అర్జున్ క్రేజ్ ను ఉపయోగించుకోవడానికి ప్రమోషన్స్ కోసం వాడుకుంటూ ఉన్నాయి. వేర్వేరు కాలేజీలు ఒకే విద్యార్థి పేరును JEE మెయిన్ ర్యాంక్‌లో పెడుతున్నాయని AISF సభ్యులు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్, శ్రీలీల అలాంటి కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారని, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.