అయాన్ గురించి కామెంట్లు చేసిన అల్లు అర్జున్.. ఫుల్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బెర్లినేల్ 2024) లో పాల్గొనడానికి జర్మనీకి వెళ్లి వచ్చారు.

By Medi Samrat  Published on  21 Feb 2024 7:39 PM IST
అయాన్ గురించి కామెంట్లు చేసిన అల్లు అర్జున్.. ఫుల్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బెర్లినేల్ 2024) లో పాల్గొనడానికి జర్మనీకి వెళ్లి వచ్చారు. అక్కడ అల్లు అర్జున్ సగర్వంగా టాలీవుడ్‌కి/భారతదేశ చలన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించారు. అక్కడ కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత ఇండియాకు చేరుకున్నారు.

అల్లు అర్జున్ ఓ కార్యక్రమంలో కొడుకు అయాన్ గురించి చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అయాన్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల అల్లు అర్జున్ బెర్లిన్ వెళ్లగా అక్కడ ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఫ్యాన్.. అల్లు అయాన్ అంటూ గట్టిగా అరిచారు. వెంటనే బన్నీ స్పందిస్తూ మోడల్ బోల్తే అంటూ మోడల్ సింబల్ చూపించారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా గట్టిగా అరుస్తూ సందడి చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఆగస్ట్ 15, 2024న బహుళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది పుష్ప 2. భారీ షెడ్యూల్‌లో అల్లు అర్జున్ కూడా భాగమవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్ సినిమాలో ఒకటిగా మారింది.

Next Story