బీరు తాగి పడుకోకండి.. పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి ఓటేయ్యండి : అల్లు అరవింద్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. రాష్ట్ర ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు

By Medi Samrat  Published on  30 Nov 2023 2:55 PM IST
బీరు తాగి పడుకోకండి.. పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి ఓటేయ్యండి : అల్లు అరవింద్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. రాష్ట్ర ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్‌లో సినీ ప్ర‌ముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అంద‌రూ ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

అనంత‌రం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఓటు ఏం వేస్తాంలే అని ఇంట్లో కూర్చుంటారు. వాళ్లంద‌రికీ నేను ఒకటి చెప్తున్నా.. ప్రతి ఒక్కరూ వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలి. లేదంటే నీకు మాట్లాడే హ‌క్కు ఉండ‌దు. ప్ర‌భుత్వం అది చేయ‌లేదు.. ఇది చేయ‌లేదు.. లాంటి ఆలోచ‌న ఉంచుకోకూడ‌దు. అలాంటిది ఏమైనా ఉందంటే లేగిసి వ‌చ్చి ఓటేయ్యండి. హాలిడే క‌దా అని బీరు తాగి ప‌డుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఓటు వేయడం మన బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు.

Next Story