నటుడు అల్లు అర్జున్ శుక్రవారం నాడు అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడిని చేసి తెలంగాణ పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. నటుడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే తెలంగాణ హై కోర్టు బెయిల్ ను ఇచ్చింది. అల్లు అర్జున్‌కి తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అయితే అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ తన తండ్రి రాత్రి ఇంటికి వచ్చేస్తాడంటూ ఎదురు చూసింది. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన తండ్రికి స్వాగతం పలకడం కోసం ఎదురుచూస్తూ కనిపించింది. హృదయాన్ని కదిలించే వీడియోలో, అర్హా గేట్ వైపే చూస్తూ ఎదురు చూసింది. అక్కడే పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు కూడా ఉండడంతో వారితో పాటూ అల్లు అర్హ కూడా ఎదురు చూస్తూ కనిపించింది. చివరికి తన తండ్రి ఈరోజు రాత్రి ఇంటికి రారని తెలుసుకుని లోపలికి వెళ్ళిపోయింది.