అల్లరి నరేష్ 'ఆ ఒక్కటి అడక్కు' రిలీజ్ డేట్ వచ్చేసింది

అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్.. అలాంటి అల్లరి నరేష్ కొన్ని రోజులు సబ్జెక్ట్ ను నమ్ముకుని సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు

By Medi Samrat  Published on  15 April 2024 8:50 PM IST
అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు రిలీజ్ డేట్ వచ్చేసింది

అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్.. అలాంటి అల్లరి నరేష్ కొన్ని రోజులు సబ్జెక్ట్ ను నమ్ముకుని సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. అయితే అల్లరోడి అల్లరి సినిమాలకు వెయిటింగ్ కూడా బాగానే పెరిగింది. ఇలాంటి సమయంలో 'ఆ ఒక్కటి అడక్కు' తో పలకరించడానికి వచ్చాడు. "ఆ ఒక్కటి అడక్కు"తో కితకితలు పెట్టడానికి సిద్ధమాయ్యాడు. నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమాను చిలకా ప్రొడక్షన్స్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫారియా అబ్దుల్లా అల్లరి నరేష్‌కి హీరోయిన్‌గా నటిస్తూ ఉంది.

ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీ ప్రకటించింది. మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "ఆ ఒక్కటి అడక్కు" వేసవి సెలవుల సీజన్‌ను లక్ష్యంగా చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను పొందింది. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రఖ్యాత డైలాగ్ రైటర్ అబ్బూరి రవి మాటలు అందించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పనులు చూసుకున్నారు. మే 3న ఆ ఒక్కటి అడక్కు అంటూ అల్లరి నరేష్ ఎంటర్టైన్ చేయడం పక్కా.

Next Story