ఓటీటీలో విడుద‌ల కానున్న 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్'

ఈ ఏడాది విడుద‌లైన‌ అత్యుత్తమ చిత్రాలలో ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ కూడా ఒకటి.

By Medi Samrat  Published on  28 Dec 2024 3:49 PM IST
ఓటీటీలో విడుద‌ల కానున్న ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్

ఈ ఏడాది విడుద‌లైన‌ అత్యుత్తమ చిత్రాలలో ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ కూడా ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ రేసులో లేకపోయినా.. అవార్డుల రేసులో అగ్రస్థానంలో నిలిచింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డును గెలుచుకోవడం నుండి గోల్డెన్ గ్లోబ్‌కు నామినేట్ అయ్యే వరకు.. ఈ చిత్రం వార్త‌ల్లో నిలిచింది.

ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 21న థియేటర్లలో విడుదల కాగా.. దాదాపు మూడున్నర నెలల తర్వాత ఈ చిత్రాన్ని OTT ప్లాట్‌ఫామ్‌లో విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని దర్శకురాలు పాయల్ కపాడియా స్వయంగా ప్రకటించారు.

పాయల్ కపాడియా ఉత్తమ చిత్రాలలో ఆల్ వి ఇమాజిన్ అజ్ లైట్ ఒకటి. ఇది న్యూ ఇయర్‌లో OTTలో బ్లాస్ట్ కానుంది. ఈ చిత్రాన్ని జనవరి 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా పాయల్ కపాడియా ప్రకటించింది. ఈ మేర‌కు దర్శకురాలు ఓ ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేసింది. మీ ప్రేమకు నేను థ్రిల్ అయ్యాను. విజయవంతమైన థియేట్రికల్ రన్ తర్వాత, ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రాబోతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. దీన్ని ఎక్కువ మంది ప్రేక్షకులతో పంచుకోవడం ప‌ట్ల‌ నేను చాలా సంతోషిస్తున్నాని తెలిపింది.

ఆల్ వి ఇమాజిన్ అజ్ లైట్ సినిమా ముంబైలో రోజువారీ జీవనం కోసం కష్టపడుతున్న ముగ్గురు మహిళల కథ. ఈ చిత్రంలో కని కృతి, దివ్యప్రభ, ఛాయా కదం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం, రచనను అందించారు.


Next Story