Big Boss : తెలుగు సీజన్-7కు సర్వం సిద్ధం
All set for Big Boss Telugu season 7. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఎంజాయ్ చేసే బిగ్ బాస్ షో త్వరలోనే మరోసారి ప్రారంభం కానుంది.
By Bhavana Sharma Published on 11 July 2023 8:16 PM ISTతెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఎంజాయ్ చేసే బిగ్ బాస్ షో త్వరలోనే మరోసారి ప్రారంభం కానుంది. తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంత ఇష్టంగా చూస్తారో సీరియల్స్ మరియు రియాలిటీ షోలను కూడా అంతే ఇష్టం మరియు ఆసక్తితో చూస్తుంటారు. గత ఆరేళ్లగా అందరినీ ఆకర్షిస్తూ సాయంత్రం అయితే చాలు ఎప్పుడు వస్తుందో అంటూ అందరినీ ఆకర్షిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. నాని దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు, ఆ తర్వాత గత మూడు నుండి నాలుగు ఏళ్లగా నాగార్జున హోస్ట్గా పనిచేస్తున్న ఈ బిగ్ బాస్ ర్యాలిటీ షో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ డిస్నీ హాట్ స్టార్ మరియు స్టార్ మా ఛానళ్లు బిగ్ బాస్ సీజన్ 7 అధికారికంగా ప్రకటించి సీజన్ యొక్క కొత్త లోగోను ఈరోజు ఆవిష్కరించారు. ఈ ప్రకటనతో త్వరలోనే బిగ్ బాస్ మన అందరి ఇళ్లకు మరోసారి రానుంది అన్న విషయంపై ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఇన్ఫ్లువెన్సెస్ తో పాటు ఎంతోమంది కామన్ మ్యాన్ కూడా పాల్గొనడం విశేషం.
అయితే ఈ కొత్త సీజన్లో పాల్గొనబోతున్న పార్టిసిపన్స్ ఎవరు అనేది మాత్రం ఇప్పటికీ బయటకి రాలేదు. త్వరలోనే షో యొక్క డేట్ అనౌన్స్మెంట్ చేసి పార్టిసిపెంట్స్ పేర్లను కూడా స్టార్ మా మేనేజ్మెంట్ బయటపెట్టనుంది. ఒకే ఇంట్లో, వంద రోజులపాటు, కనీసం సెల్ ఫోన్స్ లేదా టీవీ వంటి మరేవీ లేకుండా, కేవలం ఒకరితో ఒకరు సమయం గడుపుతూ, ఒకరి బట్టలు మరొకరు ఉతుక్కుంటూ, ఇచ్చిన టాస్కులు పూర్తిచేసుకుని ఈ కెప్టెన్సీ ని సరిగ్గా నిర్వహిస్తూ, 15 నుండి 20 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు.
ఈ కొత్త సీజన్ ను యాంకర్ గా ఏ హీరో నిర్వహించనున్నారు అనేది ఇప్పటికీ తెలియాల్సి ఉంది. గత కొన్నేళ్లగా యాంకర్ గా సోను నిర్వహిస్తున్న నాగార్జునే మళ్లీ యాంకర్ గా వస్తారా లేదంటే మరో కొత్త హీరో వస్తాడు అనేది మాత్రం ఇప్పటికే తెలియాల్సి ఉంది.