అప్పుడు విరాట్-అనుష్క కోరినట్లుగా.. ఇప్పుడు ఆలియా-రణబీర్

Alia Bhatt And Ranbir Kapoor Request Paparazzi Not To Click Pics Of Daughter Raha. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే..!

By Medi Samrat
Published on : 8 Jan 2023 3:19 PM IST

అప్పుడు విరాట్-అనుష్క కోరినట్లుగా.. ఇప్పుడు ఆలియా-రణబీర్

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే..! ఆమెను చాలా వరకూ బయట ప్రపంచానికి తెలియకుండా ఆ కపుల్స్ చూసుకున్నారు. తమతో పాటూ బయటకు వచ్చినప్పుడు మా కుమార్తె ఫోటోలు, వీడియోలు తీయకండని విరుష్క జంట గతంలో మీడియాను కోరింది. ఇప్పుడు అదే బాటలో అలియా-రణబీర్ కూడా నడిచారు.

రణబీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14, 2022న వివాహం చేసుకున్నారు. ఈ జంటకి రాహా అనే కూతురు పుట్టింది. కూతురి పిక్స్ బయటికి రాకుండా ఈ జంట గోప్యంగా ఉంచింది. ఈ జంట ఫొటోగ్రాఫర్లను వ్యక్తిగతంగా కలిసి కొన్ని రోజుల పాటు తమ కూతురి ఫొటోలు తీయొద్దని అభ్యర్థించారు. తనకి సరైన వయస్సు వచ్చి, సమయంలో వచ్చినప్పుడు తన ఫొటోలను తీసుకోడానికి అనుమతిస్తామని హామీ ఇచ్చారు.


Next Story