త‌ల్లి కాబోతున్న 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్‌

Alia Bhatt and Ranbir Kapoor announce pregnancy. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి

By Medi Samrat
Published on : 27 Jun 2022 3:11 PM IST

త‌ల్లి కాబోతున్న ఆర్ఆర్ఆర్ హీరోయిన్‌

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి అలియాభట్ తల్లి కాబోతోంది. రణబీర్ కపూర్, అలియాభట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకోవడం తెలిసిందే. పెళ్లయిన రెండు నెలలకే అలియాభట్ కడుపుతో ఉన్న‌ట్లు వార్త బయటకు వచ్చింది. సోనో గ్రఫీ పరీక్ష చేయించుకుంటున్న ఫొటోను అలియానే స్వయంగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆమె పక్కనే ఉన్న రణబీర్ కపూర్ స్క్రీన్ వైపు చూస్తున్నాడు.

'మా బేబీ త్వరలోనే వస్తోంది'అంటూ అలియాభట్ ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. అలియా సోమవారం నాడు ఆసుపత్రిలో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది, "Our baby ….. coming soon." అంటూ సింహం తమ పిల్లతో ఉన్న ఫోటోను కూడా ఆమె షేర్ చేసింది.

అలియా, రణబీర్ కొన్ని సంవత్సరాల పాటూ డేటింగ్ చేశారు. ఏప్రిల్ 2022లో ముంబైలోని వాస్తులో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అలియా, రణబీర్ మొదటిసారిగా తెరపై కలిసి కనిపించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, కింగ్ నాగార్జున కూడా నటించారు. సెప్టెంబర్ 9న సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.












Next Story