రిచా చద్దాను పెళ్లి చేసుకోబోతున్న అలీ

Ali Fazal, Richa Chadha’s wedding invite is out. అలీ ఫజల్.. బాలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా ఎదిగాడు.

By Medi Samrat  Published on  21 Sept 2022 4:45 PM IST
రిచా చద్దాను పెళ్లి చేసుకోబోతున్న అలీ

అలీ ఫజల్.. బాలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా ఎదిగాడు. మీర్జాపూర్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే..! తాజాగా అతడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. బాలీవుడ్ నటి రిచా చద్దాను పెళ్లి చేసుకోబోతున్నాడు. అలీ ఫజల్, రిచా చద్దా ఈ అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారు. రిచా- అలీ ఫజల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. రెట్రో అనుభూతిని కలిగించేలా వెడ్డింగ్ ఇన్విటేషన్ ను డిజైన్ చేశారు. రిచా చద్దా, అలీ ఫజల్ ఈ అక్టోబర్‌లో ఒక్కటికానున్నారు. వారి ఆహ్వానం అగ్గిపెట్టె ఆకారంలో ఉంది, 90ల నాటి ప్రత్యేక అనుభూతిని కలిగి ఉంది.

అలీ ఫజల్ మరియు రిచా చద్దా దాదాపు దశాబ్ద కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 'ఫుక్రే' సినిమా సెట్స్‌లో మొదట కలుసుకున్నారు. ఇద్దరూ మొదట్లో తమ వ్యక్తిగత జీవితాల గురించి మీడియా ముందు మాట్లాడలేదు. చాలా రోజులు సీక్రెట్ గానే ఉంచుకున్నారు. వారి వివాహ వేడుకలకు సంబంధించి, ఐదు రోజుల వేడుకలు సెప్టెంబర్ చివరి వారంలో ఢిల్లీలో ప్రారంభమవుతాయి. అక్టోబర్‌లో ముంబైలో ముగుస్తాయి. వీరిద్దరూ అక్టోబర్ 2న ఢిల్లీలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. అక్టోబర్ 7న ముంబైలో కూడా రిసెప్షన్ జరగనుంది.


Next Story