మీర్జాపూర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వచ్చేస్తోంది

Ali Fazal Aka Guddu Pandit's Special Note To Mirzapur Season 3 Team. మీర్జాపూర్ అభిమానులకు శుభవార్త. అమెజాన్ ప్రైమ్ వీడియోకు చెందిన ఒరిజినల్ షో భారీ హిట్

By Medi Samrat  Published on  5 Dec 2022 7:45 PM IST
మీర్జాపూర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వచ్చేస్తోంది

మీర్జాపూర్ అభిమానులకు శుభవార్త. అమెజాన్ ప్రైమ్ వీడియోకు చెందిన ఒరిజినల్ షో భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు ఈ సిరీస్ లో మూడవ సీజన్ షూటింగ్ పూర్తయిందని అలీ ఫజల్ అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో టీమ్ తో కలిసి ఉన్న వీడియోను, ఫోటోను పంచుకున్నారు. అతను సహనటి శ్వేతా త్రిపాఠి శర్మ, మిగిలిన బృందంతో కలిసి కనిపించాడు. మీర్జాపూర్‌లో గుడ్డు పండిట్‌గా నటించాడు అలీ ఫజల్. హిందీలో విడుదలైన ఈ సిరీస్ తెలుగులో కూడా భారీగా హిట్ అయింది. ఇప్పటికే రెండు సీజన్లు ప్రేక్షకులను అలరించింది. మున్నా త్రిపాఠిగా దివ్యేంద్రు, అఖండానంద్ త్రిపాఠిగా పంకజ్ త్రిపాఠి అదుర్స్ అనిపించారు. మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అలీ ఫజల్ తాజాగా మీర్జాపూర్ మూడో సీజన్ షూటింగ్ పూర్తయిందని తెలిపారు. వెబ్ సిరీస్ బృందంతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గోలు గుప్తా పాత్రలో నటించిన శ్వేతా త్రిపాఠి ఇతర నటులు, సాంకేతిక సిబ్బంది షూటింగ్ పూర్తయిన సందర్భంగా గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. 2023లో ఈ సిరీస్ ను విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. రసిక దుగల్, హర్షిత శేఖర్ గౌర్‌, అమిత్ సియాల్, అంజుమ్ శర్మ, షీబా చద్దా, మను రిషి చద్దా, రాజేష్ తైలాంగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story