పృథ్వీ రాజ్.. తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారే..!

Akshay Kumar's Prithviraj Movie Telugu Teaser Released. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇప్పటికే పుష్ప, ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్స్ కాగా..

By Medi Samrat  Published on  15 April 2022 7:15 PM IST
పృథ్వీ రాజ్.. తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారే..!

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇప్పటికే పుష్ప, ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్స్ కాగా.. కేజీఎఫ్-2 హవా నడుస్తూ ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉన్న సినిమాలు దక్షిణాదిన సందడి చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన పృథ్వీ రాజ్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు.

అక్షయ్ కుమార్, సంజయ్ దత్, మానుషి చిల్లర్, సోనూ సూద్ ల భారీ తారాగణం ఉన్న సినిమా పృథ్వీరాజ్. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అనేక వాయిదాల తర్వాత చివరకు జూన్ 3న విడుదల కానుంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది.

తమిళం, తెలుగులో పృథ్వీరాజ్ టీజర్ విడుదల

2020లో అక్షయ్ కుమార్ 52వ పుట్టినరోజు సందర్భంగా పృథ్వీరాజ్‌ని ప్రకటించారు. ఈ చిత్రం పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క అద్భుతమైన జీవితం ఆధారంగా రూపొందించబడింది. పృథ్వీరాజ్ టీజర్‌ను పంచుకుంటూ, నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇలా రాసింది, "Brave and victorious. He was Samrat Prithviraj Chauhan. Watch his story come to life in telugu on 3rd June! Celebrate Samrat #Prithviraj Chauhan with #YRF50 only at a big screen near you (sic)." రాసుకొచ్చింది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్ టైటిల్ రోల్‌లో కనిపించనుండగా, మానుషి చిల్లర్ సంయోగిత పాత్రలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది.




















Next Story