అక్షయ్ కుమార్.. బాలీవుడ్ లో లక్కీ హీరో అని అంటూ ఉంటారు. ఎందుకంటే అతడి సినిమాలు మినిమమ్ గ్యారెంటీ హిట్స్ గా నిలుస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ మార్కెట్ తలకిందులైందని మార్కెట్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఎంతో వేగంగా సినిమాలను చేసుకుంటూ వెళ్లే అక్షయ్ కుమార్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సూర్యవంశీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదని పించుకుంది. ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు ఫ్లాఫుల్లా మారిపోయాయి. బచ్చన్ పాండే.. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ.. హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ఇక బెల్ బాటమ్, పృథ్వీరాజ్, రక్షా బంధన్ సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి.
రామ్ సేతు సినిమాకు ఆశించినంత కలెక్షన్స్ రాకపోవడంతో అక్కీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. రాబోయే కొద్ది నెలల్లో అక్షయ్ కుమార్ నుండి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. చూస్తూ ఉంటే అక్షయ్ కుమార్ మార్కెట్ బాగా డల్ అయినట్లు అనిపిస్తోంది. ఏది ఏమైనా భారీగా పారితోషికం తీసుకునే అక్షయ్ కాస్త కథల మీద కూడా దృష్టి పెట్టాలని అభిమానులు కోరుతూ ఉన్నారు. అక్షయ్ కుమార్ బ్యాడ్ టైమ్ నుండి బయటపడాలని.. మంచి హిట్స్ అందుకోవాలని ఆశిస్తూ ఉన్నారు.