'కన్నప్ప' సినిమా కోసం ఆయన్ను దింపారంటే.. ఇక రచ్చ రచ్చే..!

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సినిమా కన్నప్ప. ఆ సినిమాలో నటించబోయే స్టార్ క్యాస్ట్ గురించి భారీగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి

By Medi Samrat  Published on  16 April 2024 12:45 PM GMT
కన్నప్ప సినిమా కోసం ఆయన్ను దింపారంటే.. ఇక రచ్చ రచ్చే..!

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సినిమా కన్నప్ప. ఆ సినిమాలో నటించబోయే స్టార్ క్యాస్ట్ గురించి భారీగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో మరో స్టార్ తెలుగు తెరకు పరిచయమవుతూ ఉన్నారు. ఇటీవల విడుదలైన యాక్షన్ చిత్రం ‘బడే మియాన్ చోటే మియాన్’లో కనిపించిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. తెలుగు భాషా చిత్రం ‘కన్నప్ప’ షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్‌ లు కూడా నటిస్తూ ఉండడం.. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా చేరడంతో సినిమా రేంజి మరింతగా పెరిగిపోతోంది.

ఈ ఎపిక్ యాక్షన్‌ సినిమాలో అక్షయ్ పాత్ర కథలో చాలా కీలకమని సినిమా టీమ్ తెలిపింది. చిత్రం క్లైమాక్స్‌లోనూ, ముఖ్యమైన సీన్స్ లో అక్షయ్ కుమార్ పాత్ర ఉండనుంది. మంచు విష్ణు మాట్లాడుతూ ''అక్షయ్‌ సర్‌తో షూటింగ్‌ చేయడం థ్రిల్‌గా ఉంది. ఇద్దరం కలిసి సినిమా క్లైమాక్స్‌ని ప్రారంభిస్తాం. ఆయన లాంటి గొప్ప నటుడు మాతో చేరడం ఎంతో గౌరవం. అక్షయ్ సర్ రాక కన్నప్ప సినిమాను నిజమైన పాన్-ఇండియన్ చిత్రంగా మార్చింది." అని తెలిపారు. ఈ తెలుగు చిత్రం కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ ఈ సినిమాలో భాగమయ్యారు.

Next Story