భారీ ఫ్లాప్ అందుకున్న భారీ బడ్జెట్ సినిమా ఓటీటీలో సందడి చేయబోతోందా..?

Akshay Kumar starrer to have an early OTT premiere. అక్షయ్ కుమార్ నటించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది.

By Medi Samrat  Published on  12 Jun 2022 4:58 PM GMT
భారీ ఫ్లాప్ అందుకున్న భారీ బడ్జెట్ సినిమా ఓటీటీలో సందడి చేయబోతోందా..?

అక్షయ్ కుమార్ నటించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఈ చిత్రం కొద్దిగా ఓపెనింగ్స్ సాధించింది. కానీ ఆ తర్వాత ప్రేక్షకులు సినిమాను పెద్దగా పట్టించుకోకపోవడంతో అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఏడు రోజుల్లో ఈ సినిమా 55.05 కోట్లు మాత్రమే సాధించింది. సామ్రాట్ పృథ్వీరాజ్ బడ్జెట్ చాలా ఎక్కువగా ఉండటం, టికెట్స్ సేల్స్ భారీగా తగ్గిపోవడంతో ఇక సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతూ ఉంది. నివేదిక ప్రకారం ఈ చిత్రం థియేట్రికల్ విడుదలైన నాలుగు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎర్లీ OTT ప్రీమియర్‌ అవ్వనుంది.

తమ సినిమాల ఓటీటీ రిలీజ్ ల విషయంలో యష్ రాజ్ సినిమాస్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నాయి. మొత్తం 2022 స్లేట్ కోసం YRF.. 4 వారాలు, 8 వారాల గ్యాప్ తో ఓటీటీ సంస్థలతో ఓపెన్-ఎండ్ ఒప్పందాన్ని ఉంచుకుంది. ఒక చిత్రం ఫెయిల్ అయితే.. ప్రొడక్షన్ హౌస్ 4 వారాల విండోను ఎంచుకుంటుంది. అది థియేటర్‌లో బాగా ఆడితే థియేట్రికల్ ఆదాయాన్ని విస్తరించడానికి ప్రీమియర్ తేదీని పొడిగించనున్నారు. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాను ఇప్పుడు 4 వారాల్లో ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. YRF తర్వాతి సినిమాలు షంషేరా, పఠాన్, టైగర్ 3 రూపొందిస్తూ ఉంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల చిత్రం కోసం, ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ సినిమాలు OTTలో ప్రీమియర్ చేయడానికి 8 వారాల విండో కోసం లాక్ చేశారు. ఈ సినిమాలను 8 వారాల తర్వాతనే ఓటీటీలో విడుదల చేయనున్నారు.

సామ్రాట్ పృథ్వీరాజ్ ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సినిమా రిలీజ్ అవ్వగానే పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ బాక్సాఫీస్ వద్ద సినిమాకు హెల్ప్ అవుతాయని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు. అక్షయ్ కుమార్‌కి ఇది వరుసగా రెండో ఫ్లాప్. ఇంతకుముందు, అతని సినిమా బచ్చన్ పాండే కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.












Next Story