కేదార్ నాథ్ ఆలయంలో అక్షయ్ కుమార్

Akshay Kumar seeks blessings at Kedarnath Temple. ఇమ్రాన్ హష్మీతో కలిసి 'సెల్ఫీ' సినిమాలో చివరిగా కనిపించాడు నటుడు అక్షయ్ కుమార్.

By Medi Samrat  Published on  23 May 2023 6:00 PM IST
కేదార్ నాథ్ ఆలయంలో అక్షయ్ కుమార్

ఇమ్రాన్ హష్మీతో కలిసి 'సెల్ఫీ' సినిమాలో చివరిగా కనిపించాడు నటుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'బడే మియాన్ చోటే మియాన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తన బిజీ షూటింగ్ షెడ్యూల్ మధ్య, అక్షయ్ విరామం తీసుకొని కేదార్‌నాథ్‌కు చేరుకున్నారు. ఆలయంలో పూజల్లో పాల్గొన్నాడు అక్షయ్.

భారీ భద్రత నడుమ మంగళవారం ఆలయానికి చేరుకున్న అక్షయ్‌ కుమార్‌.. స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల అభిమానులకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. అతని అభిమానులు అక్షయ్ తో ఫోటోలు తీసుకోవడం కోసం వెంబడిస్తూ కనిపించారు. అతను తన అభిమానులను పలకరిస్తూ.. వారితో 'భమ్ భమ్ భోలే' అని నినాదాలు చేయడం కనిపిస్తుంది. అక్షయ్ నల్లటి టీ-షర్ట్, జీన్స్ ధరించి కనిపించాడు.


Next Story