అత్యధిక పన్ను చెల్లింపుదారుగా అక్షయ్.. ఆదాయపు పన్ను శాఖ నుండి సర్టిఫికేట్

Akshay Kumar becomes the highest taxpayer. సినీ పరిశ్రమ నుంచి అత్యధిక పన్ను చెల్లింపుదారుగా అక్షయ్ కుమార్ మరోసారి నిలిచారు.

By Medi Samrat
Published on : 24 July 2022 5:44 PM IST

అత్యధిక పన్ను చెల్లింపుదారుగా అక్షయ్.. ఆదాయపు పన్ను శాఖ నుండి సర్టిఫికేట్

సినీ పరిశ్రమ నుంచి అత్యధిక పన్ను చెల్లింపుదారుగా అక్షయ్ కుమార్ మరోసారి నిలిచారు. ఆదాయపు పన్ను శాఖ నటుడికి సమ్మాన్ పత్ర, గౌరవ ధృవీకరణ పత్రాన్ని కూడా ఇచ్చింది. నివేదికల ప్రకారం, అక్షయ్ కుమార్ గత ఐదేళ్లుగా అత్యధిక పన్ను చెల్లింపుదారుడి టైటిల్‌ను నిలుపుకున్నారు.

అక్షయ్ కుమార్ ప్రస్తుతం UKలో షూటింగ్‌లో ఉన్నందున, అక్షయ్ తరపున ఆయన బృందం ఆదాయపు పన్ను శాఖ నుండి గౌరవ ధృవీకరణ పత్రాన్ని స్వీకరించింది. గత ఐదేళ్లలో భారతదేశపు అతిపెద్ద పన్ను చెల్లింపుదారులలో అక్షయ్ ఉన్నారు. భారతదేశంలో అత్యంత బిజీ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరిగా నిలిచారు. భారీగా రెమ్యునరేషన్ ను అందుకుంటూ ఉన్నాడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల జాబితాలో చోటు సంపాదించడంలో ఆశ్చర్యం లేదు. అక్షయ్ కుమార్ గౌరవ సర్టిఫికెట్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అక్షయ్ కుమార్ ప్రస్తుతం యుకెలో తిను దేశాయ్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు. అతను చివరిసారిగా సామ్రాట్ పృథ్వీరాజ్‌సినిమాలో కనిపించాడు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. రక్షా బంధన్‌, రామ్ సేతు, సెల్ఫీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఓహ్ మై గాడ్ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే సమంతా రూత్ ప్రభుతో కలిసి కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్ సీజన్ 7'లో అక్షయ్ అతిథిగా కనిపించాడు.


Next Story