కన్నప్పలో శివుడిగా అక్షయ్ కుమార్.. ఫస్ట్ లుక్ రిలీజ్‌

మూడు దశాబ్దాలుగా హిందీ చిత్రసీమలో రాణించిన‌ అక్షయ్ కుమార్ తొలిసారి ఓ సౌత్ సినిమాలో న‌టించాడు.

By Medi Samrat  Published on  20 Jan 2025 1:05 PM IST
కన్నప్పలో శివుడిగా అక్షయ్ కుమార్.. ఫస్ట్ లుక్ రిలీజ్‌

మూడు దశాబ్దాలుగా హిందీ చిత్రసీమలో రాణించిన‌ అక్షయ్ కుమార్ తొలిసారి ఓ సౌత్ సినిమాలో న‌టించాడు. కన్నప్ప సినిమాతో ఆయ‌న‌ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అక్షయ్ కుమార్ లుక్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. భారీ తారాగ‌ణంతో.. భారీ బ‌డ్జెట్‌తో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

చిత్ర‌బృందం అక్షయ్ కుమార్ లుక్ రివీల్ చేయ‌గా.. పోస్టర్‌లో అక్ష‌య్‌ కుమార్ ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమ‌రుకం పట్టుకుని కనిపించాడు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో మహాదేవ్ పాత్రలో కనిపించనున్నాడు. ముల్లోకాలు ఏలే ప‌ర‌మేశ్వ‌రుడు భ‌క్తికి మాత్రం దాసుడు అని పేర్కొంటూ పోస్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. శివుడి పాత్రలో అక్షయ్‌కుమార్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహాదేవ్ పాత్రలో అక్షయ్ సర్ చేసినంత పరిపూర్ణంగా మరెవరూ కనిపించరని నెటిజ‌న్లు త‌మ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మోహన్ బాబు నిర్మిస్తున్న కన్నప్ప చిత్రంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ పౌరాణిక చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధు, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

Next Story