ఏపీ సీఎంతో అక్కినేని నాగార్జున సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

By Knakam Karthik
Published on : 3 Jun 2025 1:42 PM IST

Andrapradesh, Cm Chandrababu, Akkineni Nagarjuna, Akhil marriage, Wedding invitation,

ఏపీ సీఎంతో అక్కినేని నాగార్జున సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. తన కుమారుడు అక్కినేని అఖిల్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు.

ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. అఖిల్ వివాహం ఈ నెల 6వ తేదీన జరగనున్న నేపథ్యంలో, నాగార్జున ప్రముఖులను స్వయంగా కలిసి వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు ఉండవల్లికి విచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇరువురు కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం.

Next Story