ఎంజాయ్ పండగో.. ఓటీటీలోకి ఏజెంట్

తెలుగు సినీ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూసిన అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.

By Medi Samrat
Published on : 13 March 2025 7:58 PM IST

ఎంజాయ్ పండగో.. ఓటీటీలోకి ఏజెంట్

తెలుగు సినీ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూసిన అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా దాదాపు రెండు సంవత్సరాల క్రితం థియేటర్లలో విడుదలైంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం మంచి అంచనాలతో విడుదలైంది కానీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత, ఈ సినిమా డిజిటల్ విడుదల చాలా కాలం పాటు ఆలస్యం అయింది. చివరకు ఏజెంట్ OTTలో విడుదలైంది.

ఈ చిత్రం నిర్మాతలు, కొనుగోలుదారులకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. అలాగే, విడుదల తర్వాత ఇది అనేక ఆర్థిక అడ్డంకులను ఎదుర్కొంది. దీని వలన ఏజెంట్ సినిమా OTT విడుదల మరింత ఆలస్యం అయింది. ఈ సినిమా ఇంకా టెలివిజన్‌లో కూడా ప్రదర్శించలేదు.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సోనీ లివ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ప్రసారం అవుతుంది. ఈ చిత్రంలో మమ్ముట్టి కీలక పాత్ర పోషించగా, సాక్షి వైద్య కథానాయికగా నటించింది.

Next Story