'ఏజెంట్' సినిమా క‌లెక్ష‌న్లు.. చాలా కాస్ట్లీ తప్పు చేశామంటున్న నిర్మాత‌

Akhil Akkineni's Agent producer Anil Sunkara reacts to film's failure. అఖిల్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా 'ఏజెంట్' సినిమా రూపొందింది.

By M.S.R  Published on  1 May 2023 8:30 PM IST
ఏజెంట్ సినిమా క‌లెక్ష‌న్లు..  చాలా కాస్ట్లీ తప్పు చేశామంటున్న నిర్మాత‌

అఖిల్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా 'ఏజెంట్' సినిమా రూపొందింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా, తొలి రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మూడు రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల గ్రాస్ ను, 5.10 కోట్ల షేర్ ను వసూలు చేసిందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 11.50 కోట్ల గ్రాస్, 6.24 కోట్ల షేర్ ను రాబట్టిందని అంటున్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఈ చిత్రం నిర్మాణ దశలో చాలా తప్పులు ఉన్నాయని అన్నారు. అనిల్ సుంకర అందుకు సంబంధించి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏజెంట్‌ ప్లాప్ కు కారణం మేమే అని ఒప్పుకుంటున్నాం. ఇది ఒక పెద్ద పని అని మాకు తెలిసినప్పటికీ, మేము దానిని జయించాలని అనుకున్నామన్నారు. మేము బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడంతో ఈ పొరపాటు జరిగిందని తెలిపారు. కోవిడ్‌ సమయంలో కూడా కొన్ని సమస్యలు తెలెత్తాయని అన్నారు. ఆ సమయంలో మేము చేసిన కొన్ని పనులు విఫలమయ్యాయి. ఇది చాలా కాస్ట్లీ తప్పు. దీనివలన మేము చాలా నేర్చుకున్నాం. అయితే సినిమా ప్లాప్ అయ్యిందని ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదు. కాకపోతే ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు అని మాత్రం హామీ ఇస్తున్నాం అని అన్నారు.


Next Story