తెలంగాణలో పెరిగిన అఖండ-2 టికెట్ల ధరలు..!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తోన్న అఖండ-2 చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

By -  Medi Samrat
Published on : 4 Dec 2025 6:10 PM IST

తెలంగాణలో పెరిగిన అఖండ-2 టికెట్ల ధరలు..!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తోన్న అఖండ-2 చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో అఖండ-2 సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 8 గంటల షోకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ రేట్ రూ.600 వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. విడుదలైన రోజు నుండి 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. పెంచిన టికెట్ రేట్ల నుండి 20 శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కండిషన్ పెట్టింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి టికెట్‌పై అదనంగా రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. పెంచిన ఈ ధరలు సినిమా విడుదలైన తొలి మూడు రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాలకృష్ణ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రీమియర్ షోను ప్రదర్శించడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ఈ స్పెషల్ షోను ప్రదర్శించనున్నారు. ఈ ప్రత్యేక షో కోసం టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 600గా నిర్ణయించారు.

Next Story