సుదీప్ వ్యాఖ్యలకు అజయ్ దేవగన్ కౌంటర్.. వెంటనే ట్విట్టర్ లో సమాధానం..

Ajay Devgn has a dabangg jawab for Kiccha Sudeep. కొద్దిరోజుల కిందట కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కేజీఎఫ్‌ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ

By Medi Samrat  Published on  27 April 2022 2:05 PM GMT
సుదీప్ వ్యాఖ్యలకు అజయ్ దేవగన్ కౌంటర్.. వెంటనే ట్విట్టర్ లో సమాధానం..

కొద్దిరోజుల కిందట కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కేజీఎఫ్‌ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీపై కీలక కామెంట్స్‌ చేశారు. ఓ ఈవెంట్ లో సుదీప్ మాట్లాడుతూ 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్‌ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్‌ ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుదీప్‌ హీరోగా విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది.

సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్ స్పందించారు. సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ హిందీ ఇకపై జాతీయ భాష కాకపోతే, తన మాతృభాష చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. "సోదర కిచ్చా సుదీప్… మీ అభిప్రాయం ప్రకారం హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తారు? హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృభాష, జాతీయ భాష. జన గణ మన" అని ట్వీట్ చేశారు.

అజయ్ దేవగన్ ట్వీట్ కు సుదీప్ వెంటనే రిప్లై ఇచ్చారు. "Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir" అంటూ సుదీప్ ట్వీట్ చేశారు. హలో.. అజయ్‌దేవ్‌గన్ సార్.. నేను చెప్పింది వేరు.. మీరు ఊహించుకుంటుంది వేరు.. నేను చెప్పిన దానికి మీరు అర్థం చేసుకున్నదానికి చాలా తేడా ఉంది. నేను చేసిన వ్యాఖ్యలను పర్సనల్ గా కలిసినప్పుడు మీకు వివరిస్తాను. ఇది ఒకరిని బాధపెట్టడానికి, రెచ్చగొట్టడానికి, ఏదైనా చర్చను ప్రారంభించడానికి చేసింది కాదు. నేను అలా చేయను కూడా అని సుదీప్ వివరించారు.

Next Story
Share it