విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్

రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్, నటుడు-దర్శకుడు ధనుష్ ఇటీవల చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు

By Medi Samrat  Published on  8 April 2024 7:10 PM IST
విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్

రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్, నటుడు-దర్శకుడు ధనుష్ ఇటీవల చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేలా సెక్షన్ 13 బి కింద పిటిషన్ దాఖలు చేసినట్లు దంపతుల సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2022 జనవరిలో విడిపోవాలనే నిర్ణయాన్ని ఇద్దరూ ప్రకటించారు. వారి ప్రకటన చాలా మందికి భారీ షాక్ గా అనిపించింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్లు వేశారు. త్వరలో వారి కేసు విచారణకు రానుంది. గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు.

జనవరి 17, 2022న, ధనుష్ Xలో విడిపోతున్నట్లు ప్రకటించారు. 18 సంవత్సరాల వివాహ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఐశ్వర్య తన సోషల్ మీడియా పేజీలో ఇలాంటి పోస్ట్‌ నే షేర్ చేశారు. ధనుష్, ఐశ్వర్య 2004 లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐశ్వర్య 'లాల్ సలామ్'తో దర్శకురాలిగా మళ్లీ బిజీ అయ్యారు. ఇందులో రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపించారు.

Next Story