ప‌నామా పేప‌ర్ లీక్.. ఐశ్వ‌ర్యరాయ్‌కి ఈడీ షాక్‌

Aishwarya Rai Summoned By Enforcement Directorate.పనామా పేపర్ లీక్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Dec 2021 6:51 AM GMT
ప‌నామా పేప‌ర్ లీక్.. ఐశ్వ‌ర్యరాయ్‌కి ఈడీ షాక్‌

పనామా పేపర్ లీక్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​పంపింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ ఐశ్వర్యరాయ్‌కి ఈడీ సమన్లు ​​జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఐశ్వర్య రాయ్ నేడు ఢిల్లీలో ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఐశ్వర్యరాయ్ ఈడీ ఎదుట విచారణకు నేడు హాజరు కావడం లేదని.. విచారణకు హాజరు కావడానికి మరో తేదీని ఐశ్వర్య రాయ్ కోరినట్లు తెలుస్తోంది.

అప్పట్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు సంబంధించి వ్యక్తిగత ఖాతా వివరాలను వెల్లడించి పనామా పేపర్స్ సంచలనం సృష్టించింది. పనామా పేపర్స్ కేసు విషయంలో అమితాబ్ బచ్చన్ కుటుంబం పేరు కూడా వచ్చింది. 2016లో యూకేలో ప‌నామా బేస్డ్ లా సంస్థ‌కు చెందిన‌ 11.5 కోట్ల ట్యాక్స్ డాక్యుమెంట్లు లీక‌య్యాయి. పనామా పత్రాల జాబితాలో పేర్లు ఉన్న వ్యక్తులు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఒక నివేదిక పేర్కొంది. పనామా పేపర్ లీక్ కేసులో బచ్చన్ కుటుంబం పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కింద కేసును నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లోని హెచ్‌ఐయూ ఈ అంశంపై దర్యాప్తు చేస్తోంది.

గతంలో ఈడీ ఐశ్వర్య రాయ్‌కు నోటీసులు పంపింది. దీంతో ఆమె సోమవారం ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్‌లో ఈడీ ముందు హాజరు అవ్వమని కోరారు. పనామా పేపర్స్ కేసులో దాదాపుగా 500 మంది భారతీయుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇందులో రాజకీయనాయకుల నుంచి, నటులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు పేర్లు ఉన్నాయి. వీరంతా పన్ను ఎగవేసినట్లుగా ఆరోపణలున్నాయి.

Next Story