పాపం.. ఆ హీరోయిన్ పెళ్లి విషయంలో ఎన్ని ట్విస్ట్ లో..!

After pics from Rakhi Sawant's court wedding goes VIRAL. బిగ్ బాస్ ఫేమ్ రాఖీ సావంత్ తన చిరకాల బాయ్ ఫ్రెండ్ ఆదిల్ దురానీని పెళ్లి చేసుకుందని కథనాలు వచ్చాయి.

By Medi Samrat
Published on : 11 Jan 2023 8:15 PM IST

పాపం.. ఆ హీరోయిన్ పెళ్లి విషయంలో ఎన్ని ట్విస్ట్ లో..!

బిగ్ బాస్ ఫేమ్ రాఖీ సావంత్ తన చిరకాల బాయ్ ఫ్రెండ్ ఆదిల్ దురానీని పెళ్లి చేసుకుందని కథనాలు వచ్చాయి. నటి అధికారికంగా పెళ్లి గురించి ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, వారి వివాహానికి సంబంధించిన చిత్రాలు వైరల్ అయ్యాయి. రాఖీ తన బంధాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుందని.. అందుకే కోర్టు మ్యారేజ్ చేసుకుందని అంటున్నారు. అయితే అభిమానులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, ఆదిల్ ఈ వార్తలను ఖండించాడు.

రాఖీ సావంత్ చాలా కాలంగా ఆదిల్ దురానీతో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇద్దరూ తరచుగా బహిరంగంగా కనిపిస్తూ ఉండేవారు. జనవరి 11 న, వారి రహస్య వివాహానికి సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి. వైరల్ ఫోటోల ప్రకారం, రాఖీ సావంత్, ఆదిల్ తమ వివాహ ధృవీకరణ పత్రంతో పోజులిచ్చినట్లు భావించవచ్చు. ఇద్దరూ వివాహ ధృవీకరణ పత్రంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. వారి రహస్య వివాహానికి సంబంధించిన వైరల్ చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వగా కొన్ని మీడియా సంస్థలు ఆదిల్‌ను సంప్రదించాయి. అయితే అతడు రాఖీ సావంత్‌తో పెళ్లిని నిరాకరించాడు.


Next Story