అవును 'ప్రభాస్' హీరోయిన్ మారింది

ప్రభాస్- సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్‌'. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌ను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

By Medi Samrat
Published on : 24 May 2025 8:45 PM IST

అవును ప్రభాస్ హీరోయిన్ మారింది

ప్రభాస్- సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్‌'. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌ను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో హీరోయిన్‌గా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఆ అవకాశాన్ని త్రిప్తి డిమ్రీ అందుకుంది. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ సందీప్‌ ఒక పోస్ట్‌ షేర్‌ చేశారు. అనిమల్ సినిమా ద్వారా త్రిప్తి డిమ్రీ దేశ వ్యాప్తంగా సంచలమైంది. ఊహించని విధంగా అవకాశాలను త్రిప్తి డిమ్రీ అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ సరసన సినిమాలో ఛాన్స్ ను అందుకుంది.

స్పిరిట్‌ చిత్రాన్ని దాదాపు 9 భాషలలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో త్రిప్తి డిమ్రీ పేరును తెలుగుతో పాటు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్‌, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో రాశారు.

Next Story