నటి శ్వేతా అగర్వాల్ ను పెళ్లాడిన ఉదిత్ నారాయణ్ కుమారుడు

Aditya Narayan ties the knot with Shweta Agarwal. ప్రముఖ గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్‌ ఓ

By Medi Samrat  Published on  2 Dec 2020 6:13 AM GMT
నటి శ్వేతా అగర్వాల్ ను పెళ్లాడిన ఉదిత్ నారాయణ్ కుమారుడు

ప్రముఖ గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్‌ ఓ ఇంటివాడయ్యాడు. ముంబైలోని ఇస్కాన్‌ టెంపుల్‌లో తాను ప్రేమించిన న‌టి శ్వేతా అగ‌ర్వాల్‌ను పెళ్లిచేసుక‌న్నాడు. కోవిడ్‌-19 నిబంధనల నేపథ్యంలో ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ప్ర‌స్తుతం ఈ పెళ్లి చిత్రాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ క్రమంలో వధూవరులు ఆదిత్య, శ్వేతతో పాటు బంధువులు సరదాగా గడిపిన వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

ఎన్నో సంవత్సరాల పాటు శ్వేతతో చేసిన స్నేహం, తరువాత ప్రేమగా మారగా, వీరిద్దరి వివాహానికి పెద్దలు అంగీకరించారు. పెళ్లికి ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డ‌గా.. ఆదిత్యతో కలిసి అతని తల్లి దీపా నారాయణ్ బారాత్ లో చేసిన సందడికి సంబంధించిన వీడియో అందరినీ అలరిస్తోంది. తండ్రిలాగే గాయకుడిగానూ సినీ అభిమానులకు పరిచితమైన ఆదిత్య, టీవీ షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు. శ్వేతతో కలిసి 'షాపిత్' అనే చిత్రంలో నటించి, నటుడిగానూ తానేంటో నిరూపించుకున్నాడు. పదేళ్ల పాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో ఓ ఇంటివార‌య్యారు.
Next Story
Share it