వరుసగా రీ రిలీజ్ లు చేస్తూనే ఉన్నారు. అయితే అనుకున్నంత రెస్పాన్స్ అయితే రావడం లేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆదిత్య 369 లాంటి క్లాసిక్ సినిమాలను కనీసం పట్టించుకోలేదు ఆడియన్స్. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'లక్ష్మీ నరసింహ' సినిమా ఒకటి రెండు చోట్ల తప్ప పెద్దగా కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది.
నందమూరి బాలకృష్ణ నటించిన చెన్న కేశవ రెడ్డి సినిమా పాత సినిమాల స్పెషల్ షోల ట్రెండ్‌ను ప్రారంభించిన తొలి చిత్రాలలో ఒకటి. ఇప్పుడు ఆయన మరో సినిమా లక్ష్మీ నరసింహ రీ-రిలీజ్ వాష్ అవుట్‌గా ముగిసింది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా, జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓవర్సీస్‌తో సహా అన్ని ప్రాంతాలలో విడుదలైంది. కొన్ని ఫ్యాన్స్ షోలను మినహాయించి, ఈ సినిమా థియేటర్లలో కనీస ఆక్యుపెన్సీని కూడా చూడలేకపోయింది.