యూట్యూబ్‌లో 'ఆదిపురుష్' పూర్తి సినిమా.. 2.3 మిలియ‌న్ల వ్యూస్ త‌ర్వాత‌..

Adipurush full movie leaked on YouTube, gains over 2 Million views. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం పలు వివాదాల తర్వాత రిలీజైంది.

By Medi Samrat  Published on  9 July 2023 7:25 PM IST
యూట్యూబ్‌లో ఆదిపురుష్ పూర్తి సినిమా.. 2.3 మిలియ‌న్ల వ్యూస్ త‌ర్వాత‌..

ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం పలు వివాదాల తర్వాత రిలీజైంది. ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి వచ్చి నెల కూడా కాలేదు. ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్ల వేట‌లో చ‌తికిల‌ప‌డింది. నెగెటివ్ ప్రచారం కారణంగా వ‌సూళ్లు సాధించ‌లేక‌పోయిన‌ ఈ సినిమా.. ఇప్పుడు ఆన్‌లైన్ పైరసీ బారిన పడింది.

పైరసీ వెబ్‌సైట్లే కాకుండా యూట్యూబ్‌లో కూడా 'ఆదిపురుష్‌' లీక్ అయింది. మేకర్స్ ఓటీటీ విడుదల తేదీని ఇంకా నిర్ణయించనప్పటికీ.. చిత్రం యూట్యూబ్‌లో లీక్ అయింది. ప‌లు మీడియా సంస్థ‌ల‌ నివేదికల ప్రకారం.. ఈ చిత్రం YouTubeలో HD నాణ్యతతో శనివారం కనిపించింది. 2.3 మిలియన్లకు పైగా మంది వీక్షించారు. అయితే.. కొన్ని గంట‌ల‌ త‌ర్వాత‌ లింక్ కనిపించకుండా పోయింది.

ఆదిపురుష్‌లోని డైలాగ్‌ల‌పై ద‌ర్శ‌కుడు ఓం రౌత్ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా డైలాగులు ఉన్నాయ‌ని సినిమా నిర్మాతలపై కూడా అభిమానులు ఫైర‌య్యారు. అనేక వివాదాల తర్వాత ఇటీవల డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు.


Next Story