మరోసారి బాక్సాఫీసును షేక్ చేసిన ప్రభాస్

Adipurush First Day Box Office Collection. ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా తొలిరోజునే రికార్డు కలెక్షన్‌లు రాబట్టింది.

By Medi Samrat  Published on  17 Jun 2023 2:01 PM IST
మరోసారి బాక్సాఫీసును షేక్ చేసిన ప్రభాస్

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా తొలిరోజునే రికార్డు కలెక్షన్‌లు రాబట్టింది. ఆదిపురుష్ సినిమా మొదటి రోజు అక్షరాల రూ.130 కోట్ల కలెక్ట్‌ చేసి బాక్సాఫీస్‌ దగ్గర ప్రభాస్‌ సత్తా చూపించింది. మొదటి వీకెండ్ కూడా బుకింగ్స్‌ భారీ రేంజ్‌లోనే ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ వరకూ ఈ సినిమాకు జోరుగా కలెక్షన్‌లు వస్తున్నాయి. ప్రభాస్‌ సినిమా రిలీజ్‌ రోజునే వంద కోట్లు సాధించిన సినిమాల్లో ఇది మూడవది. దీనికంటే ముందు బాహుబలి-2, సాహో సినిమాలు ఆ లిస్ట్‌లో ఉన్నాయి. భారతదేశంలో మూడు సార్లు తొలిరోజు వంద కోట్లు సాధించిన హీరోగా ప్రభాస్‌ నిలిచాడు. వరల్డ్ వైడ్‌గా ‘ఆదిపురుష్’ మూవీ రూ.271 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. మరి బ్లాక్ బస్టర్‌గా నిలవాలంటే శని, ఆదివారాలు వచ్చే కలెక్షన్స్ కీలకంగా మారనున్నాయి.

రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్‌ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్‌ సీతగా కనిపించింది. లంకాధిపతి రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్ కనిపించాడు. రెట్రో ఫైల్స్, టి సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా రిలీజ్ చేసింది. జూన్ 16న తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, త‌మిళ భాష‌ల్లో రిలీజైన ఈ చిత్రం తొలి రోజున భారీ క‌లెక్ష‌న్స్ సాధిస్తుంద‌నే అంచనాలు ఉండగా.. ఆ అంచనాలను అందుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ‘ఆదిపురుష్’ వసూళ్లు ఇలా ఉన్నాయి:

నైజాం - రూ.13.68కోట్లు

సీడెడ్ - రూ.3.52కోట్లు

ఉత్త‌రాంధ్ర - 3.72 కోట్లు

ఈస్ట్ - రూ. 2.78 కోట్లు

వెస్ట్ - రూ. 2.24 కోట్లు

గుంటూరు - రూ.4 కోట్లు

కృష్ణా - రూ.2 కోట్లు

నెల్లూరు - రూ. 90 లక్షలు

తెలుగు రాష్ట్రాల్లో ‘ఆదిపురుష్’ సినిమా రూ.32.84 కోట్లు షేర్స్ కలెక్షన్స్ సాధించింది. కర్ణాటకలో రూ.8.57 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.. తమిళనాడులో రూ.2.35 కోట్లు వచ్చాయి. రెస్టాఫ్ ఇండియా అంతా కలుపుకుని రూ.48.24 కోట్లు వచ్చాయి. ఓవర్ సీస్ కలెక్షన్స్ చూస్తే రూ. 26.75 కోట్లు అని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకు మొదటి రోజు మొత్తంగా చూస్తే రూ.136.84 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.


Next Story