వామ్మో.. ఆదిపురుష్ అంత భారీ హిట్ అయిందా?

ఆదిపురుష్.. ఒక్క ప్రభాస్ అభిమానులే కాదు. సినీ అభిమానులందరూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోగా.

By Medi Samrat  Published on  10 Nov 2023 5:57 PM IST
వామ్మో.. ఆదిపురుష్ అంత భారీ హిట్ అయిందా?

ఆదిపురుష్.. ఒక్క ప్రభాస్ అభిమానులే కాదు. సినీ అభిమానులందరూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోగా.. విడుదలైన రోజు నుండే ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచింది. కొద్దో గొప్పో 3డీలో సినిమాను చూసిన వాళ్లే బాగుందంటూ కామెంట్లు చేశారు. ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచినప్పటికీ.. బుల్లితెర మీద మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిందని అంటున్నారు.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ఆదిపురుష్ సినిమాను ప్రసారం చేయగా ఈ సినిమాకు ఏకంగా 9.47 (అర్బన్) రేటింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన రేటింగ్స్ అన్నిటినీ చూసుకుంటే ఆదిపురుష్ సినిమా బుల్లితెరపై సూపర్ హిట్ అని చెప్పొచ్చు. మూవీ ఓటీటీలో, టెలివిజన్ లో హిట్ అవ్వడం ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందిస్తూ ఉన్నారు. ఈ మూవీ ప్రసారం అయ్యే టైంలోనే వరల్డ్ కప్ మ్యాచ్ కూడా టీవీలలో ప్రసారం అయింది. అయినా కూడా మంచి టీఆర్పీని ఆదిపురుష్ సొంతం చేసుకుంది.

Next Story