ఆ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకున్న వైష్ణవి..!

బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తర్వాత నటి వైష్ణవికి పెద్దగా ఆఫర్లు రాలేదనే ప్రచారం సాగింది.

By Medi Samrat  Published on  13 Sept 2023 8:45 PM IST
ఆ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకున్న వైష్ణవి..!

బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తర్వాత నటి వైష్ణవికి పెద్దగా ఆఫర్లు రాలేదనే ప్రచారం సాగింది. అయితే అమ్మడు క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమవుతూ ఉంది. యువ నటి DJ టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో అవకాశం దొరికిందని అంటున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు శిరీష్‌కి జోడీగా కొత్త చిత్రంలో నటించనుందని కూడా ప్రచారం సాగుతోంది. జూలైలో విడుదలైన బేబీ అనే చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తమ నటనకు ప్రశంసలు అందుకున్నారు. వైష్ణవి తన నటనకు ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. కంటిన్యూగా ఆఫర్లు అందుకోలేక పోయినా ఎట్టకేలకు ఆమెకు సరైన అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.

యంగ్ హీరోల జోడీగా ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుందనే టాక్ బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపిస్తోంది. తాజాగా 'బొమ్మరిల్లు' భాస్కర్ ప్రాజెక్టు విషయంలోనూ ఆమె పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం వైష్ణవిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

Next Story