మేడారం జాతరలో పెంపుడు కుక్కను తూకం వేసి మొక్కు చెల్లించుకున్న నటి టీనా శ్రావ్య క్షమాపణలు చెప్పింది. తాను పెంచుకుంటున్న కుక్కకి 12 ఏళ్లు. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది మంచిగా కోలుకోవాలని సమ్మక్కను మొక్కుకున్నాను. అనుకున్నట్లుగానే కుక్క కోలుకుని బాగా నడుస్తోందన్నారు శ్రావ్య. అందుకే మొక్కు చెల్లించాలని నా కుక్కతో తూకం వేయించాను. అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో చేయలేదన్నారు మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారం ప్రకారం అది తప్పని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను చేసిన పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగనివ్వనన్నారు.