ప్రముఖ సినీ నటి స్నేహ, తన భర్త ప్రసన్న కుమార్ తో కలిసి అరుణాచలం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇద్దరూ కలిసి గిరి ప్రదక్షిణ చేశారు. అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీరిద్దరూ కాళ్లకు చెప్పులు ధరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడం అపచారమని, ఇది మహా పాపమని విమర్శించారు.
అరుణాచలానికి వెళ్లే భక్తులలో ఎక్కువగా తెలుగు వాళ్లే ఉంటుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటూ కర్ణాటక రాష్ట్రాల భక్తులు పెద్ద ఎత్తున పున్నమి రోజున గిరివలయం ప్రదక్షిణ చేస్తూ ఉంటారు.