టార్గెట్ చేశారా.. రష్మికను మరింత వల్గర్ గా చూపించారు..!

పలువురు నటీ నటులను డీప్ ఫేక్ వీడియోలు ఎంతగానో వేధిస్తూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  12 March 2024 9:00 PM IST
టార్గెట్ చేశారా.. రష్మికను మరింత వల్గర్ గా చూపించారు..!

పలువురు నటీ నటులను డీప్ ఫేక్ వీడియోలు ఎంతగానో వేధిస్తూ ఉన్నాయి. గతంలో రష్మిక మందాన డీప్ ఫేక్ బాధితురాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వచ్చాయి. తాజాగా మరో వీడియో రష్మిక మందానను వల్గర్ గా చూపించింది. ఇది కూడా డీప్ ఫేక్ వీడియోనే!! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. ఈ డిప్‌ఫేక్ వీడియోలో ఓ యువ‌తి అస‌భ్య‌క‌రంగా డ్యాన్స్ చేస్తూ క‌నిపించింది. ఈ వీడియోపై ర‌ష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో రష్మిక మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రముఖులకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

ర‌ష్మిక బాలీవుడ్ మూవీ 'యానిమ‌ల్‌'తో ఇటీవలే బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఆమె 'పుష్ప‌-2', 'ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌', 'రెయిన్ బో' వంటి చిత్రాల‌తో బిజీగా ఉంది.

Next Story