నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు.. ఆ స్టార్‌ హీరో ఒక నైట్‌ గడపమన్నాడంటూ

Actress Pragati sensational comments. సినిమా రంగం అంటేనే.. అదో విభిన్న ప్రపంచం. ఇక్కడ సక్సెస్‌ కావలంటే ఎన్నో కష్టాలను, నష్టాలను.. వాటితో పాటు అవమానాలను ఎదుర్కోక

By అంజి  Published on  4 Feb 2022 10:49 AM GMT
నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు.. ఆ స్టార్‌ హీరో ఒక నైట్‌ గడపమన్నాడంటూ

సినిమా రంగం అంటేనే.. అదో విభిన్న ప్రపంచం. ఇక్కడ సక్సెస్‌ కావలంటే ఎన్నో కష్టాలను, నష్టాలను.. వాటితో పాటు అవమానాలను ఎదుర్కోక తప్పదు. మరీ ముఖ్యమంగా హీరోయిన్లు క్యాస్టింగ్‌ కౌచ్ బారిన పడుతున్నారు. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులు అవమానాలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలా అవమానాలను గురయ్యే మహిళ ఆర్టిస్ట్‌లు.. సందర్భం వచ్చినప్పుడు తమకు జరిగిని అన్యాయాలను ప్రజలకు ముందు ఉంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ నటి ప్రగతి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కెరీర్‌ స్టారింగ్‌లో తాను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నానని నటి ప్రగతి సంచలన విషయాలు బయటపెట్టింది. ఓ స్టార్‌ హీరో తనను లైంగికంగా వేధించాడని ఆమె ఒక ఇంటర్య్వూలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుగులో సినిమాల్లో ప్రగతి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, తల్లి, అత్త పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. నటి ప్రగతి అసలు ఆ ఇంటర్య్వూలో ఏమని చెప్పిందంటే.. తాను సినీ కెరీర్‌ స్టార్ట్‌ చేసినప్పుడు ఛాన్స్‌ల కోసం డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ల దగ్గరకు వెళ్లినప్పుడు.. వారు ఒక నైట్‌ టైమ్‌ స్పెండ్‌ చేస్తే ఛాన్స్‌ దక్కుతుందని అనే వారని ప్రగతి చెప్పింది. ఛాన్స్‌లో కోసం డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌లే కాకుండా ఓ హీరో కూడా తనను లైంగిక వేధించాడని చెప్పింది. ఆ హీరో పేరు మాత్రం నటి ప్రగతి బయట పెట్టలేదు. అయితే తాను అవకాశాల కోసం వారికి లొంగలేదన్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మహిళా ఆర్టిస్ట్‌లు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. ఛాన్స్‌ల కోసం తలవంచితే ఇబ్బందులు తప్పవని, టాలెంట్‌ ఉంటే ఛాన్స్‌లు అవే వెతుక్కుంటూ మరి వస్తాయని ఇంటర్య్వూలో చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Next Story
Share it